తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం : జాతీయ జెండా ఎగరేసిన శాసన మండలి ఛైర్మన్

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం : జాతీయ జెండా ఎగరేసిన శాసన మండలి ఛైర్మన్

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసన మండలిలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అసెంబ్లీ  ఆవరణలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగరేశారు.