రాజన్నసిరిసిల్ల/వేములవాడ రూరల్, వెలుగు: అర్హత గల ప్రతిఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లకు సూచించారు. గురువారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ , వేములవాడ గ్రామీణ మండలం మల్లారం, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఆయన వెంట డీపీవో రవీందర్, కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు.
గోదావరిఖని: ప్రజాపాలన సెంటర్లకు వచ్చే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం రామగుండం బల్దియా పరిధిలోని 41, 42 డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను సందర్శించారు. గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు బాలరాజు, విజయ, తదితరులున్నారు