బోధన్​లో ప్రజాపాలన విజయోత్సవాలు

బోధన్​లో ప్రజాపాలన విజయోత్సవాలు

బోధన్​,వెలుగు : బోధన్ పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో మున్సిపల్​ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, కౌన్సిలర్లు అంబేద్కర్​ చౌరస్తాలో రోడ్లను శుభ్రం చేసి విజయోత్సవాలు చేశారు.  ఈసందర్భంగా మున్సిపల్​ చైర్​ పర్సన్​ తూము పద్మావతి మాట్లడుతూ ఈనెల  1నుంచి  9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

కాంగ్రెస్​  అధికారం చేపట్టి ఏడాదిలో  చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.   పట్టణంలోని వార్డుల్లో విజయోత్సలు నిర్వహిస్తామనr తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ వెంకట నారాయణ, మున్సిపల్​ అధికారులు, కౌన్సిలర్లు   పాల్గొన్నారు.