నెట్వర్క్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎంఎన్ ఆర్ఈజీఎస్ స్కీమ్కింద కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామపంచాయతీ భవన్ నిర్మాణ పనులను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి కలెక్టర్వెంకటేశ్ధోత్రే ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి-ఉపాధి భరోసా, ఉద్యానవన, వనమహోత్సవం, జల నిధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ పనులు, 80 అంగన్ వాడీ కేంద్రాలు, 30 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాల పనులకు గాను ఉపాధి హామీ పథకంలో రూ.37 కోట్లుమంజూరు చేసినట్లు చెప్పారు.
జన్నారం మండలం పొన్కల్ లో సీసీ రోడ్డుతోపాటు లోతొర్రె, గోండుగూడలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణ పనులు, మురిమడుగులో పౌల్ట్రీ షెడ్లను ఎమ్మల్యే బొజ్జుపటేల్ ప్రారంభించారు. పాత బెల్లంపల్లి గ్రామపంచాయతీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు, తాళ్ల గురుజాల గ్రామపంచాయతీలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు.
దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో 20 లక్షలతో జీపీ భవనం, గూడెంలో రూ.12 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం, మామిడిపల్లిలో రూ3 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, మండల స్పెషల్ ఆఫీసర్ పి.రవీందర్ రెడ్డి, తహసీల్దార్ సంధ్యారాణి భూమిపూజ చేశారు. జైపూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో రూ.86 లక్షల అభివృద్ది పనులను జడ్పీ సీఈవో గణపతి ప్రారంభించారు. కోళ్ల ఫారం, అంగన్ వాడీ భవనం, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, కంపోస్టు ఫార్మేషన్ పనులకు భూమి పూజ చేశారు.
లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో ఎల్లారంలో గ్రామ పంచాయతీ భవనం, అంకతిపల్లిలో సీసీ రోడ్లు, సూరారంలో జీపీ భవనానికి ప్రహరీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. నేరడిగొండ మండలంలోని రాజురాలో రూ.20 లక్షలతో జీపీ బిల్డింగ్ రూ.12 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్, బోథ్‌లోని పిప్పల్ధరిలో జీపీ భవనా నికి, కౌఠ'బి'లో అంగన్వాడీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ భూమి పూజ చేశారు.