పెద్దమ్మ తల్లి ఆలయంలో టెండర్లు వాయిదా

పాల్వంచ, వెలుగు : మండలంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో మూడు ఫంక్ష న్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లోని రెండు దుకాణాలు, పాత కాంప్లెక్స్ లో బొమ్మలు, చీరలు, బల్లలు అమ్మకానికి నిర్వహించాల్సిన టెండర్ వాయిదా పడింది. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఈ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పది రోజులుగా ప్రకటనలు ఇస్తున్నారు. అయినా మూడోసారి కూడా ఎవరూ పాటాదారులు రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. 

పంచామృతాభిషేఖం

ఆలయంలోని మూల విరాట్ కు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. పంచ హారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈవో రజనీకుమారి, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.