ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నతాధికారులు కింది స్థాయి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఖమ్మం న్యూ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు.
ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యల మీద అప్లికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, దళితబంధు యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రోగ్రాంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read : గంజాయి బ్యాచ్‌లోని 18 మందిపై కేసు .. పరారీలో ఏడుగురు