ప్రజావాణి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నతాధికారులు కింది స్థాయి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఖమ్మం న్యూ  కలెక్టరేట్​లోని మీటింగ్​ హాల్​లో గ్రీవెన్స్​డే సందర్భంగా కలెక్టర్​ వీపీ గౌతమ్, అడిషనల్​ కలెక్టర్​ సత్యప్రసాద్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు.

ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యల మీద అప్లికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, దళితబంధు యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రోగ్రాంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Also Read : గంజాయి బ్యాచ్​లోని 18 మందిపై కేసు .. పరారీలో ఏడుగురు