భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా వరదనీరు రావడంతో మూడు గేట్లు ఎత్తారు అధికారులు.అయినా వరద ఆగడం లేదు. ఉదృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఒక్కసారిగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో నారాయణపురం గ్రామం సమీపంలోని కట్టమైసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో
దాదాపు 30 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. కొందరు పశువుల కాపరులు చెట్టుపై చిక్కుకున్నారు. ప్రాజెక్ట్ వరద తాకిడికి ఇప్పటికే అనంతరం పరిసర ప్రాంత గ్రామాలు నీట మునిగాయి.
మరో వైపు మంత్రి తుమ్మల, పొంగులేటి ఆదేశాలతో NDRF బృందం హెలికాప్టర్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వాగులో చిక్కుకున్న 30 మందిని..చెట్టుపై చిక్కుకున్న పశువుల కాపర్లను కాపాడేందుకు చర్యలు చేపట్టారు.