నిజామాబాద్, వెలుగు : ‘ప్రజావాణి’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్మీటింగ్హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆయ న హాజరై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయా సమస్యలపై మొత్తం 73 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, డీఆర్డీవో చందర్, జడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పెషల్‌ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి
క్రీడా ప్రాంగణాలు, మన ఊరు -మన బడి, హరిత హారం, మెగా పల్లె ప్రకృతి వనాల పురోగతి పనులను నిశితంగా పరిశీలించేందుకు మండల స్పెషల్‌ఆఫీసర్లు మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ పక్కాగా చేపట్టాలన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేసే పంచాయతీ సెక్రటరీలను ఉపేక్షించబోమని కలెక్టర్హెచ్చరించారు. కాగా వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడంతో టెన్త్, ఇంటర్స్టూడెంట్లకు సంక్రాంతి తర్వాత స్పెషల్‌క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్‌చేయాలని డీఈవో దుర్గాప్రసాద్ ను ఆదేశించారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది
కామారెడ్డి, వెలుగు: రాష్ర్టంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఈ పాలనకు విముక్తి కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ సీనియర్‌నేత షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా ముఖ్య నేతల మీటింగ్ జరిగింది. హాజరైన షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదన్నారు. 8 ఏండ్లుగా రాష్ర్టంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమంపై లీడర్లకు దిశా నిర్ధేశం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎస్. గంగారాం, లీడర్లు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శివాజీ విగ్రహం ప్రారంభించరా?
బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పి 9 నెలలు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుంట లేరని బీజేపీ లీడర్లు సోమవారం ఆర్డీవో ఆఫీస్ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహ ప్రారంభాన్ని ఒక వర్గం వారు అడ్డుకున్నారని వాయిదా వేశారని, అనంతరం మున్సిపాలిటీలో తీర్మానం చేసినా.. ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పదిరోజుల్లో శివాజీ విగ్రహం ప్రారంభించకపోతే తామే ప్రారంభించుకుంటామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌చారి, లీడర్లు బాల్‌రాజ్, మేక విజయ సంతోష్, రజనీ కిషోర్, రామరాజులు, బొడ్డు రవి, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలపై విచారణ జరిపించాలి
ఆర్మూర్, వెలుగు : మున్సిపాలిటీ పరిధిలో జరుగు తున్న అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ లీడర్లు డిమాండ్‌చేశారు. సోమవారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, టౌన్ ప్రెసిడెంట్అనిల్ మాట్లాడుతూ.. యానంగుట్ట దగ్గర కరీం అనే వ్యక్తికి కేటాయించిన అసైన్డ్ భూమిలో అక్రమ లేఔట్లు వెలిశాయని, కోర్టులో కేసు ఉండగా వెంచర్ కు ఎలా పర్మిషన్ఇచ్చారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలోని ప్రభుత్వ, నాన్ లే అవుట్ స్థలాల్లో, కోర్టు కేసు ఉన్న స్థలాల్లో ఏ అధికారంతో ఇంటి నంబర్లు కేటాయించారో కలెక్టర్ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఒక్కటై అవినీతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ డీఈ రమణారావు సూసైడ్వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. లీడర్లు ద్యాగ ఉదయ్, పల్లె శ్రీనివాస్, ధోండి ప్రకాశ్, కలిగోట ప్రశాంత్ పాల్గొన్నారు.
దారితప్పి జనావాసాల్లోకి జింకపిల్ల..
ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించిన గ్రామస్తులు
పిట్లం, వెలుగు: దారి తప్పి పిట్లం గ్రామంలోకి వచ్చిన జింక పిల్లను స్థానికులు పట్టుకుని ఫారెస్ట్డిఫ్యూటీ రేంజ్ఆఫీసర్రఘుపతికి అప్పగించారు. సోమవారం పిట్లం లోని నేతాజీ నగర్లో జింక పిల్లను కుక్కలు తరుముతుండడం గమనించిన స్థానిక యువకుడు వాసరి రమేశ్ కుక్కల నుంచి కాపాడాడు. అనంతరం స్థానికుల సాయంతో వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. జింకపిల్లకు గాయాలు మానే వరకు సంరక్షించి అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలో వదిలేస్తామని రఘుపతి తెలిపారు. కుక్కల దాడి నుంచి కాపాడిన యువకుడిని ఆయన అభినందించారు.