ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఈ సీజన్ లో తొలిసారి పొగమంచు ప్రారంభమైంది. పొగమంచుతో ఆదిలాబాద్ అందాలు రెట్టింపు అయ్యాయని స్థానికులు అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కవ్వాల్ అభయారణ్యంలో కూడా పొగ మంచు కరిసింది. ప్రకృతి అందాలను ఆస్వాదించామని మార్నింగ్ వాకర్స్ తెలుపుతున్నారు. నిన్నటి వరకు వానలు, ఎండలతో ఇబ్బందులు పడిన జిల్లా వాసులకు కాస్త ఊరట లభించిందంటున్నారు.
ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేశామని అంటున్నారు. మరోవైపు పొగమంచుతో వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడ్డారు. ఉదయం కూలీ పనులకు వెళ్లే వాళ్లు కూడా అవస్థలు పడ్డారు. అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వాకర్స్ పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు.