- ఢిల్లీలో ప్రజా పాలన– ప్రజా విజయోత్సవాల్లో జితేందర్‌రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫ్యూచర్ స్టేట్’గా నిలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ కష్టపడుతున్నదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ప్రజా విజయోత్సవాల్లో ఆయన మాట్లాడారు.