కామారెడ్డి కలెక్టరేట్​లో ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

కామారెడ్డి కలెక్టరేట్​లో ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
  • కామారెడ్డి జిల్లాలో 131, నిమాజామాబాద్​ జిల్లాలో 82 ఫిర్యాదులు

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 131 ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్​ కలెక్టర్లు వి.విక్టర్​, శ్రీనివాస్​రెడ్డి  ఫిర్యాదులను స్వీకరించారు.  వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఇప్పటి వరకు 20,370 ఫిర్యాదులు స్వీకరిస్తే ఇందులో 19,567 పరిష్కరించామని, 803 పెండింగ్​లో ఉన్నాయన్నారు. పెండింగ్​లో ఉన్న వాటిని వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, జడ్పీ సీఈవో  చందర్​నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి  82 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని  కలెక్టర్  రాజీవ్​గాంధీ హనుమంతు,  అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్ ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్​ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.