ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైర్డ్ మెడిసిన్ ఎందుకు పడేస్తలేరు?

  •     డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ దవాఖాన్లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ అయిన మెడిసిన్స్ నిల్వ ఉంచుతుండడంపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్ రవీందర్ నాయక్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలపై ఫైర్ అయ్యారు. ఆ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పడేయకుండా హాస్పిటళ్లలో ఎందుకు నిల్వ ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్య లు ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలకు లేఖ రాశారు.

 ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ అయిపోయిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆకస్మిక తనిఖీల్లో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ మెడిసిన్ దొరికితే, సంబంధిత హాస్పిటల్ అధికారులతో పాటు డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.