ఎన్టీపీసీ పబ్లిక్​ హియరింగ్​ సజావుగా జరిగేలా చూడాలి : సీపీ ఎం.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌

ఎన్టీపీసీ పబ్లిక్​ హియరింగ్​ సజావుగా జరిగేలా చూడాలి :  సీపీ ఎం.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: ఈ నెల 28న నిర్వహించనున్న ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్​ 800 మెగావాట్ల మూడు యూనిట్లకు సంబంధించిన పబ్లిక్​ హియరింగ్​ సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సహకరించాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​, పెద్దపల్లి అడిషనల్​ కలెక్టర్​ వేణు కోరారు. శుక్రవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో ఎన్టీపీసీ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సీపీ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

28న జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న పబ్లిక్​ హియరింగ్​ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఎన్ని గ్రామాల ప్రజలు హాజరవుతారు.. పోలీస్​బందోబస్త్‌‌‌‌‌‌‌‌, పార్కింగ్​ స్థలాలు, తదితర అంశాలపై చర్చించారు. మీటింగ్​లో డీసీపీ చేతన, ఆర్డీవో బి.గంగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్ ఏసీపీలు నర్సింహులు, చందన్ కుమార్ సమంత, ఎన్టీపీసీ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ హెడ్​ బీకే సిక్దర్​, బినోయ్ జోషి, ప్రవీణ్, కేవీరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.