వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​.. ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​.. ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

కాశీబుగ్గ (కార్పొరేషన్)/ హనుమకొండ కలెక్టరేట్/ ములుగు/ ​జనగామ అర్బన్/ మహబూబాబాద్, వెలుగు: ​ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం దరఖాస్తులు భారీగా వచ్చాయి. గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​లో బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకాడే అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 120 ఆర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. కాగా,  57వ డివిజన్​లోని సమ్మయ్యనగర్​లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి, బల్దియా మేయర్​ గుండు సుధారాణితో కలిసి బల్దియా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. 

అనంతరం బల్దియా డైరీ ఆవిష్కరించారు. హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు వివిధ సమస్యలపై 106 వినతులు వచ్చాయని కలెక్టర్​ ప్రావీణ్య తెలిపారు. ములుగులో మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ దివాకర పేర్కొన్నారు. జనగామ గ్రీవెన్స్​లో 43 వినతులు వచ్చినట్లు అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​ సింగ్​ చెప్పారు. మహబూబాబాద్​గ్రీవెన్స్​లో 75 వినతులు వచ్చాయని కలెక్టర్​ అద్వైత్​కుమార్​ సింగ్​ తెలిపారు. ఆయా సమస్యలపై ఆరా తీసి పరిష్కరించాలని వారు అధికారులను ఆదేశించారు.