కరోనా భయంతో చాలా మంది అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీల ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. డిమాండ్‌ను తట్టుకోవడానికి అమెజాన్ వంటి కంపెనీలు వేలాది మందిని ఇటీవల నియమించుకున్నాయి. గత మూడు నెలల్లో పట్టణాల్లోని ఆన్‌లైన్ కస్టమర్ల సంఖ్య 42 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.
బెంగళూరు: కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్ల సంఖ్య రెండింతలు పెరిగింది. గత మూడు నెలల్లో పట్టణాలలోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవాళ్లు 42 శాతానికి పెరిగినట్టు కన్సల్టింగ్ సంస్థ కాంటర్ ఓ స్టడీలో వెల్లడించింది. వీరిలో 50 శాతం మంది కొత్త యూజర్లేనని, ఈ యూజర్లు టైర్ 1, టైర్ 2 సిటీల వారని పేర్కొంది. ఆన్‌లైన్ షాపర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో షాపింగ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ స్టడీ తెలిపింది. కరోనా రాక ముందు, ఇండియాలో 22 శాతం అర్బన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు మాత్రమే ఆన్‌లైన్‌గా షాపింగ్ చేసేవారు. గత ఏడాది 30.9 కోట్ల మంది అర్బన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉంటే, వారిలో 13 కోట్ల మంది మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్లు. కరోనా మహమ్మారితో ఈ–కామర్స్ సేల్స్ బాగా పెరిగాయి. లాక్‌డౌన్‌తో చాలా మంది తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌గా కొనడం ప్రారంభించారు. పండగ సీజన్‌లో ఆర్డర్లు ఇంకా పెరుగుతాయని, ఫెస్టివ్ సేల్‌కు రెడీ అవుతున్నామని ఆన్‌లైన్‌షాపింగ్ కంపెనీలు తెలిపాయి. ‘సాధారణ జనం ఖర్చుల్లో రెస్టారెంట్లకు వెళడ్లం, ట్రావెల్, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటివే ఉంటాయి. కానీ ప్రస్తుతం ప్రజలు కరోనాభయానికి బయటికి వెళడ్లం మానేయడంతో ఈ ఖర్చులన్నీ తగ్గిపోగ్గియాయి. ఇప్పుడు శాలరీలు వచ్చాక మధ్యతరగతి ప్రజలు గ్రూమింగ్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్స్ వంటి సెగ్మెంట్లపై ఖర్చు పెడుతున్నారు ’ అని ఇయర్ ఫోన్స్, స్పీకర్లు అమ్మే ఆన్‌లైన్ కన్జూమర్ బ్రాండ్ బోట్ లైఫ్ స్టయిల్ కో–ఫౌండర్ అమన్ గుప్తా తెలిపారు. ఇటీవల ముగిసిన ఆన్‌లైన్ సేల్స్‌లో 30 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని గుప్తా చెప్పారు. కరోనా తర్వాత ఇదే తమకు మేజర్ సేల్ అని పేర్కొన్నారు.
ఫ్లిప్‌కార్ట్‌ను దాటేసిన అమెజాన్..
మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుత ఆన్‌లైన్ షాపర్లకోసం అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, క్లాత్స్‌వంటి సెగ్మెంట్లలో అమ్మకాలు ఎక్కువ జరిగాయి. అమెజాన్ ఇండియా గ్రోసరీ, హౌస్‌హోల్డ్ ఐటమ్స్, స్మార్ట్ ఫోన్ సేల్స్‌లో ముందంజలో ఉంది. తొలిసారి అమెజాన్ ఇండియా ఫ్లిప్‌కార్ట్ ను మించి స్మార్ట్ ఫోన్లను అమ్మింది. మరికొందరు షాపర్లు ఫెస్టివ్ సేల్స్ కోసం వేచిచూస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్ సేల్స్ 20 శాతం ఎక్కువగా ఉంటాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫారెస్టర్ ఎనలిస్ట్ సతీష్ మీనా తెలిపారు. గతేడాది పండగ నెలలో ఈ–కామర్స్ కంపెనీల మొత్తం అమ్మకాల విలువ ఐదు బిలియన్ డాలర్లు. ‘మరింత మంది కస్టమర్లను, సెల్లర్లను ఆకర్షించడంపై మేం ఫోకస్ చేశాం. మారుమూల ప్రాంతాలకూ చేరుకుంటాం. విభిన్న రకాలైన ప్రొడక్టలను కస్టమర్లకు ఆఫర్ చేసేందుకు సెల్లర్లతో, పార్టనర్లతో కలిసి పనిచేస్తున్నాం. అమెజాన్ డాట్ ఇన్‌పై సురక్షితమైన, సౌకర్యవంతమైన కొనుగోలు అనుభవాన్ని పొందవచ్చు’ అని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
For More News..