ప్రజా గ్రంథాలయానికి బుక్స్ అందజేత

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని ప్రజా గ్రంథాలయం నిరుద్యోగులకు వరంలా మారుతోంది. గ్రామీణ ప్రాంత యువతీయువకులు ఈ గ్రంథాలయంలో చదువుతూ..  ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో  ముల్కనూర్ కు చెందిన అన్నాచెల్లెళ్లు  దొండ దివ్య కానిస్టేబుల్​గా,  దొండ రాజు కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగం సాధించారు.

తమకు ఉద్యోగ అవకాశం దక్కేందుకు కారణమైన ఈ  గ్రంథాలయానికి తమ తండ్రి దొండ రవి చేతుల మీదుగా రూ. 10వేల  విలువైన బుక్స్ ను ఆదివారం అందించారు. లైబ్రరీ కి అవసరమైన బుక్స్ అందజేయడంపై  సభ్యులు లక్ష్మయ్య, ప్రమోద్ రెడ్డి , డాక్టర్ ఎదులాపురం తిరుపతి, పలువురు నిరుద్యోగ విద్యార్థులు రాజు, దివ్యను అభినందించారు.