ఫిబ్రవరి10న నిర్వహించే ప్రజావాణి  వాయిదా

 ఫిబ్రవరి10న నిర్వహించే ప్రజావాణి  వాయిదా

జనగామ అర్బన్, వెలుగు :  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ , తహసీల్దార్​ ఆఫీసుల్లో   నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్‍ డాక్టర్‍ సత్యశారద ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు, పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా సోమవారం ప్రజావాణి సమావేశం ఉండదన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు దీన్ని గమనించాలన్నారు.  ఫిర్యాదులు అందించడానికి వరంగల్‍ కలెక్టర్‍ కార్యాలయానికి రావొద్దని తెలిపారు.