- కరోనా టీకా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపని హెల్త్ స్టాఫ్
- సెలెక్ట్ చేసిన వారిలో 36% మంది వ్యాక్సిన్‌కు దూరం
- ప్రైవేట్‌లో వ్యాక్సినేషన్.. ఫస్ట్ రోజు 20 వేల మందికి
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి హెల్త్ స్టాఫ్ ఇంట్రెస్ట్ చూపట్లేదు. టీకాపై ఉన్న అనుమానాలతో వ్యాక్సినేషన్ కు ముందుకు రావట్లేదు. ఇప్పటివరకు సర్కారు నిర్ణయించిన వారిలో సోమవారం నాటికి 64 శాతం మందే వ్యాక్సిన్ తీసుకున్నారు. 36 శాతం మంది దూరంగా ఉన్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు 2,14,418 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 1,30,607 మందే తీసుకోవడానికి ముందుకొచ్చారు. సోమవారం 42,915 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా సగం మంది కూడా రాలేదు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో కొందరు ప్రెగ్నెన్సీ, అనారోగ్య కారణాల వల్ల తీసుకోలేదు. గవర్నమెంట్ హెల్త్ స్టాఫ్‌కు సోమవారంతో ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రైవేట్ హెల్త్ స్టాఫ్‌కు టీకా వేయడం షురువైంది. సోమవారం 495 సెంటర్లలో 20,359 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇందులో ఐదుగురికే రియాక్షన్స్ వచ్చాయని, మిగిలిన వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లో వ్యాక్సినేషన్ ఉండదని, గురువారం నుంచి కొనసాగిస్తామని ప్రకటించారు.
నిమ్స్‌లో స్పెషల్ వార్డు
వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే రియాక్షన్స్‌కు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ అందించాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఛాతిలో నొప్పి వంటి సీరియస్ రియాక్షన్స్ ఉంటే వెంటనే ఆ పేషెంట్లను సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు తరలించాలని సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ సోమవారం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. దీంతో నిమ్స్‌లో ప్రత్యేకంగా ఓ వార్డును కేటాయించాలని రాష్ర్ట అధికారులు నిర్ణయించి డిస్ర్టిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన ఆరుగురూ ఛాతిలో నొప్పితోనే మరణించారు. మన రాష్ర్టంలో నిర్మల్‌లో అంబులెన్స్ డ్రైవర్, వరంగల్ అర్బన్‌లో మరో లేడీ హెల్త్ వర్కర్ మృతి చెందింది. డ్రైవర్ గుండెపోటుతో చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. లేడీ హెల్త్ వర్కర్ మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. ఆమె కూడా గుండెపోటుతోనే చనిపోయినట్టు ఆఫ్ ది రికార్డులో ఆఫీసర్లు చెబుతున్నారు. ఇద్దరి బాడీల నుంచి సేకరించిన బ్లడ్, ఇతర శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉంది.
For More News..