యువతి లో దుస్తులతో క్షుద్ర పూజలేంట్రా బాబూ.. జనగామ జిల్లాలో కలకలం !

యువతి లో దుస్తులతో క్షుద్ర పూజలేంట్రా బాబూ.. జనగామ జిల్లాలో కలకలం !

జనగామ: జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. కోడిని బలిచ్చి, పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేశారు. క్షుద్రపూజలు చేసిన స్థలంలో యువతి లో దుస్తులు కనిపించడంతో ఒక యువతిపై పగతో రగిలిపోతూ ఆమె నాశనాన్ని కోరుతూ క్షుద్రపూజలు చేయించినట్లు స్పష్టమైంది.

యువతికి చేతబడి చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రాల శబ్దాలు విని ఘటన స్థలానికి రైతులు వెళ్లారు. రైతులను చూసి క్షుద్రపూజలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీలో 2025 జనవరిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని కన్నాలబస్తీలో మారుపాక శ్రీనివాస్ ఇంటిముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఉదయం శ్రీనివాస్  ఇంటి తలుపు తెరిచి చూసేసరికి  ఇంటి ముందు క్షుద్ర పూజల ముగ్గు కనిపించడంతో కంగుతిన్నాడు. ఆ కుటుంబసభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు.

క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మేవారూ లేకపోలేదు. 2024, మే నెలలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌‌‌‌లో ఆరోగ్యంతో పాటు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.

క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుప్త నిధులు దొరుకుతాయని కొందరు వ్యక్తులు చెప్పడంతో తన ఇంట్లో పూజలు చేసేందుకు పద్మ ఒప్పుకుంది. రాత్రి వేళ క్షుద్ర పూజలు చేయడంతో పాటు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.

పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా విషయం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పద్మ, ఓ మైనర్‌‌‌‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎన్నో ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలకు అద్దం పడుతున్నాయి.