బషీర్బాగ్, వెలుగు: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్లోని జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక మహా ధర్నా నిర్వహించింది. మంగళవారం వందలాది మంది తరలివచ్చి కార్యాలయం గేటు ముందు బైఠాయించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల లబ్ధిదారులకు ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. తొమ్మిది ఏండ్లలో 5 వేల మందికి మాత్రమే ఇండ్లు కేటాయించారని వేదిక నాయకుడు, సీఐటీయూ కార్యదర్శి ఎం వెంకటేశ్ మండిపడ్డారు.