
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం హైదరాబాద్లో జనాలు ఎగబడుతున్నారు. మొదటి డోసు తీసుకున్న వాళ్లు.. రెండో డోసు కోసం బారులు తీరుతున్నారు. అయితే వారి కోసం వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీలోని బస్తీ దవాఖానలో కోవిడ్ వాక్సిన్ కోసం వర్షంలో తడుస్తూ బారులు తీరారు. అయితే వాక్సిన్ కోసం వచ్చే వాళ్ల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
For More News..