పబ్లిక్ రిలేషన్​కు ప్రాధాన్యం పెరుగుతోంది

పబ్లిక్ రిలేషన్​కు ప్రాధాన్యం పెరుగుతోంది
  • పబ్లిక్ రిలేషన్​కు ప్రాధాన్యం పెరుగుతోంది
  • ‘ట్రెండ్స్ ఇన్ పీఆర్​ఇన్ 2023’  కార్యక్రమంలో నిపుణుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సోషల్​ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం ప్రమాదకర రీతిలో పెరిగిపోయిందని, దీంతో పబ్లిక్ రిలేషన్స్ కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థుతుల్లో ఏ సంస్థ అయినా సోషల్​ మీడియా ప్రచారాలపై స్పందించేందుకు, సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు పీఆర్ టీంలపైనే ఆధారపడుతున్నాయని వివరించారు. ఈమేరకు సోమవారం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ, హైదరాబాద్​ బ్రాంచి, సెయింట్​ జోసెఫ్​ డిగ్రీ, పీజీ కాలేజీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిపుణులు మాట్లాడారు. 2023లో ట్రెండ్స్ ఇన్ పీఆర్ పేరుతో జరిగిన ఈ ప్రోగ్రాంలో పీఆర్, కమ్యూనికేషన్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నిపుణులు డాక్టర్ రోహిత్​ రాజ్ మాథూర్ (ఆయన్స్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓఎస్డీ), రామచంద్రం (సోలస్ మీడియా ఫౌండర్) ప్రసంగించారు. పీఆర్ అండ్​ కమ్యూనికేషన్ నిపుణులు, సెయింట్​ జోసెఫ్​ కాలేజీ ఫ్యాకల్టీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

రెప్యుటేషన్ నిలబెట్టుకోవడంపైనే..

ఈ డిజిటల్​ యుగంలో ఒక సంస్థ మనుగడ దాని గౌ రవం, జనంలో తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉందని డాక్టర్ మాథూర్ స్పష్టం చేశారు. రెప్యూటేషన్​ పోగొట్టుకుంటే ఇక భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని తెలిపారు.  స్కిల్స్​ పెంచుకోవాలి..పబ్లిక్ రిలేషన్ రంగానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ రంగంలో ప్రొఫెషనల్​ గా స్థిరపడాలని అనుకునే వారికి సోలస్ మీడియా ఫౌండర్​ డి.రామచంద్రం పలు సూచనలు చేశారు. అన్నింట్లోకి ముఖ్యమైంది.. విషయం ఏదైనా సరే, సోషల్​ మీడియాలో దానిని వైరల్​ గా మార్చేయగల నైపుణ్యం ఉండాలని చెప్పారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.బాబ్జీ, సొసైటీ హైదరాబాద్​ చైర్మన్ డాక్టర్ ఎస్.రాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పీఆర్​ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రోగ్రాంలో సొసైటీ హైదరాబాద్​ బ్రాంచ్​ కార్యదర్శి యాదగిరి, జాయింట్​ సెక్రెటరీ అపర్ణ రాజ్​హాన్స్ మాట్లాడారు.