స్కూళ్లలో టీచర్లు పాఠాలు మాని .. ఫోన్లతో బిజీ 

స్కూళ్లలో టీచర్లు పాఠాలు మాని .. ఫోన్లతో బిజీ 

 

 

  • మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు
     
    ములకలపల్లి, వెలుగు :  పలు స్కూళ్లలో స్టూడెంట్స్​కు టీచర్లు లెసన్స్​ చెప్పకుండా ఫోన్లు చూస్తూ రూ.వేలల్లో  జీతాలు తీసుకుంటున్నారని మండల ప్రజా ప్రతినిధులు ఎంఈవో శ్రీరామ్మూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ప్రస్తుత వర్షాకాలంలో  మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి.

 దీంతో14 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమైన శాఖల అధికారులు సమావేశానికి రాకపోవడంతో ఎంపీవో లక్ష్మయ్యపై ఎంపీటీసీ సభ్యులు మడకం విజయ, సరోజిని, వైస్ ఎంపీపీ పుల్లారావు, కోఆప్షన్ సభ్యుడు జబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధికారులపై ఐటీడీఏ పీవో, కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సున్నం నాగమణి, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీవో లక్ష్మయ్య, మండల అధికారులు పాల్గొన్నారు.