ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.4లక్షల కోట్లు

ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.4లక్షల కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నాయి. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 ట్రిలి యన్‌ (రూ.1.4 లక్షల కోట్లు) లను  దాటింది. గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) కలిసి 2022-23లో రూ. 1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.

ఈ లాభాల్లో స్టేట్ బ్యాంక్ ఇండియా ఆదారయం 40 శాతానికి పైగా అందించింది. గత ఆర్థిక సంవత్సరం ఎస్ బీఐ నికర  లాభం రూ. 50,232 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ. 61,077 కోట్లు లాభాన్ని ఆర్జించింది. 

శాతం ప్రకారం ఢిల్లీకి చెందిన పంజాబ్ నేనల్ బ్యాంకు అత్యధిక నికర లాభం 228 శాతం పెరిగి రూ. 8,245కోట్లకు చేరింది.దీంతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వద్దితో రూ. 13,649 కోట్లకు చేరింది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతంతో రెండో స్థానంలో ఉంది. దీని నికర లాభం రూ. 2,549 కోట్లుకు పెరిగింది. 

నికర లాభంలో 50 శాతానికి పైగా జంప్ చేసిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318కోట్లకు చేరుకోగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం వృద్దితో రూ. 4,055కోట్లు చేరింది. చెన్నైకి చెందిన ఇండియా బ్యాంక్ 53 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 8,063 కోట్లకు చేరింది.