సూర్యాపేటలో అఘోరీ హల్చల్.. ఆమె కత్తి తీస్తే జనం కర్రలు తీశారు..

సూర్యాపేటలో అఘోరీ హల్చల్.. ఆమె కత్తి తీస్తే జనం కర్రలు తీశారు..

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. శనివారం అర్ధరాత్రి చివ్వెంల మండలం ఉండ్రుకొండ గ్రామస్తులు ఫంక్షన్కు హాజరై వెళ్తుండగా ఉండ్రుకొండ వద్ద లేడీ అఘోరీ కనిపించింది. వాహనాలను ఆపి లేడీ అఘోరీతో వారు ఫొటోలు, వీడియోలు తీస్తుండడంతో గ్రామస్తులతో ఆమె వాగ్వాదానికి దిగింది. సహనం కోల్పోయి కారులో ఉన్న తల్వారు (కత్తి) తీసుకొని స్థానికులపై దాడి చేసింది. ఆగ్రహించిన గ్రామస్తులు కట్టెలతో ఆమెపై దాడికి దిగారు.

స్థానికులు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె అర్ధరాత్రి రోడ్డుపై కూర్చుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఖాసీంపేట వద్ద అఘోరీ మళ్లీ ప్రత్యక్షమైంది. అక్కడున్న యువకులతో కూడా వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించారు.