Life style: మాంసాహారం రేటు తగ్గింది...శాఖాహారం ధర పెరిగింది

Life style: మాంసాహారం రేటు తగ్గింది...శాఖాహారం ధర పెరిగింది

కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఇక సండే అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కొంతమంది పొద్దుపొద్దున్నే చికెన్, మటన్, ఫిష్ షాపుల ముందు జనం క్యూకడుతారు. ఇక  ఆదివారం వచ్చిందంటే చాలు.. ఆ రోజు మాంసాహారం తినడం చాలామందికి అలవాటుగా మారిపోయింది.  కాని ఇప్పుడు కొంతమంది ప్రతి రోజు నాన్​ వెజ్​ లాగించేస్తున్నారట.. ఎందుకంటే.. కూరగాయల రేట్లు అందనంత ఎత్తులో ఉన్నాయి,, వీటితో పొలిస్తే  మాంసాహారం తక్కువ ధరకు లభిస్తుందని  ప్రతి నెలా క్రిస్ విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ నివేదికలో తెలిపింది.

ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ధరల కన్నా వెజ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సగటున చూస్తే గత ఏడాది ఇదే సమయంలో శాఖాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార ధరలు నాలుగు శాతం తగ్గినట్లు  క్రిసిల్​​  తన నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా క్రిస్ విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ నివేదిక ప్రకారం గత ఏడాది (2023)  జూన్ లో రూ.26.7 గా ఉన్న ప్లేట్ రోటీ ధర ఇప్పుడు ఏకంగా రూ.29.4 కు పెరిగింది. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, ఆలూ 59 శాతం పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. 

నాన్ వెజ్ అతిగా తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి తింటే ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. అయినా సరే ఇప్పుడు జనాలు నాన్​ వెజ్​కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు నాన్ వెజ్ తినాలంటే బాబోయ్ ఎంత రేటో అనుకునేవారు. అప్పట్లో వెజ్ మీల్స్ చాలా చౌకగా లభ్యమయ్యేవి..ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. 

ప్రస్తుతం  నాన్ వెజ్ కు డిమాండ్​ తగ్గంది  2023లో రూ.60.5 గా ఉన్న ప్లేట్ చికెన్ థాలీ రేటు ఈ సంవత్సరం మరింతగా పడిపోయింది. ప్రస్తుతం రూ.58కే లభ్యమవుతోంది. బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఆహారం విషయంలో పబ్లిక్ అభిరుచులు మారడమే ఇందుకు కారణమంటోంది క్రిసిల్. అంతేకాదు పబ్లిక్ లో పెరగిన ఆరోగ్య అవగాహన కూడా ఇందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

2019 లో కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత  ప్రజల ఆహార అభిరుచులలో బాగా తేడా వచ్చింది. ముఖ్యంగా నాన్ వెజ్ పై ప్రజల అభిప్రాయం మారుతోంది. వెజ్ తోనే ఆరోగ్యం అని భావించడంతో ఇప్పుడు వెజ్ ఫుడ్ అమాంతం రెండింతలై కూర్చొంది. దాంతో మార్కెట్లో వెజ్ మీల్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో 80 రూపాయలు ఉన్న వెజ్ మీల్స్ ఇప్పుడు ఏకంగా 180 నుంచి 200 వరకూ వెళ్లిపోయింది. శాఖాహారంలో పోషకాలు ఎక్కువగా లభ్యమవడంతో ఎక్కువ శాతం వెజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ ప్రభావం కూడా వెజ్ మీల్స్ పై పడటంతో రేట్లు తప్పనిసరిగా పెంచాల్సివస్తోంది.

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదించింది. క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా చెబుతుంది.ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి తింటే పిల్లల కోసం ప్లాన్ చేస్తోన్న పురుషులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంట. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే.. పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్.. పురుషులలోని టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం చూపిస్తాయని తేలింది. తక్కువ టెస్టోస్టెరాన్.. గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు.రెడ్ మీట్, చికెన్ , ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని అధ్యయనం నిర్వహించిన నిపుణులు సూచించారు. ఈ మాంసం ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది. చాలా మంది ప్రజలు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.