జీహెచ్ఎంసీ( GHMC) ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో పెట్టిన పబ్లిక్ టాయిలెట్స్ పనికి రాకుండా పోతున్నాయి. ఎన్నికలప్పుడు హడావిడిగా పెట్టడమే తప్ప వాటి మెయింటెనెన్స్ మాత్రం పట్టించుకోలేదు అధికారులు. ఒక్కో టాయిలెట్ కు రూ.3 లక్షల చొప్పున 7500 టాయిలెట్స్ పెడితే.. ఇప్పుడు అందులో ఉపయోగంలో ఉన్నవి చాలా తక్కువ. టాయిలెట్స్ ఏర్పాటుకు దాదాపు రూ. 70కోట్లు ఖర్చు చేయగా.. వాటి మెయింటెనెన్స్ కోసం మరో 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు అధికారులు చెబుతున్నారు. టాయిలెట్స్ లో 10శాతం కూడా జనానికి ఉపయోగపడేలా లేవు. చాలా టాయిలెట్స్ డ్యామెజ్ అయ్యాయి. మరికొన్ని ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి.
తాజాగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అన్ని టాయిలెట్స్ ను రిపేర్ చేసి.. మెయింటైన్ చేయాలని బల్దియా ఆలోచిస్తోంది. జనం కోసం పెట్టిన టాయిలెట్స్ ఇన్నాళ్లు ప్రచారానికి ఐతే ఉపయోగపడ్డాయి కానీ.. పబ్లిక్ కు మాత్రం ఉపయోగపడలేదు. ఇప్పటికైనా వాటిని బాగుచేసి ఉపయోగంలోకి తేవాలంటున్నారు సిటి పబ్లిక్.