ట్యాంక్ బండ్పై ప్రజా విజయోత్సవాలు..ఆకట్టుకున్న ఎయిర్ షో

కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ఇండియన్ ఎయిర్ షో ఆకట్టుకుంది. ఎయిర్ షో చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తన తరలి వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 

ALSO READ | Ramappa Temple: రామప్ప టెంపుల్ అభివృద్దికి రూ.73కోట్లు.. జీవో రిలీజ్

మరోవైపు  సోమవారం సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ,శ్రీధర బాబు పరిశీలించారు.  అనంతరం ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై  తెలంగాణ వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. HMDA లో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఫుడ్ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సందర్శించారు. దీంతో పాటు ఐమాక్స్ గ్రౌండ్స్ లో రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కర్సర్ట్ అలరించింది. పాటలతో సిప్లిగంజ్ హోరిత్తించారు.