కామేపల్లి, వెలుగు : కామేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా పుచ్చకాయల వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం సొసైటీ కార్యాలయంలో ఎన్నికల అధికారి సందీప్ కుమార్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సొసైటీ లో ఉన్న డైరెక్టర్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పుచ్చకాయల వీరభద్రం ఒక్కరే చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ప్రకటించారు.
అనంతరం వీరభద్రం మాట్లాడుతూ ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి ఇన్‌టైంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, జిల్లా నాయకులు ఏపూరి మహేందర్ కుమార్, పత్తే మహ్మద్ చైర్మన్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నాగయ్య, ఎంపీటీసీ సభ్యుడు నల్లమోతు లక్ష్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్మాలపాటి సత్యనారాయణ, మద్దినేని నరసింహారావు, బానోత్ నరసింహ నాయక్, దేవండ్ల రామకృష్ణ, చల్లా మల్లయ్య, బావ్ సింగ్, జక్కంపూడి వెంకటేశ్వర్లు, దొడ్ల వేణు, శీలం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.