ప్రముఖ కంపెనీల పేరుతో కల్తీ నీటి దందా

  • ప్లాంట్ సీజ్ చేసిన అధికారులు

బషీర్ బాగ్, వెలుగు : కల్తీ నీటి దందా చేస్తున్న వాటర్ ప్లాంట్​ను పుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. షేక్ ఉమర్ అనే వ్యక్తి కాచిగూడ నింబోలి అడ్డాలో గుట్టుచప్పుడు కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్​ను నిర్వహిస్తున్నాడు. ప్రముఖ కంపెనీల పేర్లలో ఒక ఆల్ఫాబెట్​ను అటుఇటుగా మార్చి బాటిళ్లను తయారుచేస్తున్నాడు. ఇందులో టీడీఎస్ (టోటల్ డి సాల్ట్ సాలిడ్స్) తక్కువగా ఉండే నీటిని నింపి, సిటీలోని ఓపెన్ బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు.

ఈ కల్తీ దందాపై సమాచారం రావడంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్​పెక్టర్ కరుణాకర్ రెడ్డి, జీహెచ్ఎంసీ పుడ్ సేఫ్టీ అధికారి స్వాతి,  సిబ్బందితో కలిసి గురువారం వాటర్ ప్లాంట్​పై దాడి చేసి, సీజ్ చేశారు.