కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి చెందిన రీసెర్చ్ స్టూడెంట్ పూదరి హరీశ్ కుమార్జర్నలిజం ఎంఫిల్లో గోల్డ్ మెడల్ పొందాడు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు యూనివర్శిటీ 16వ స్నాతకోత్సవంలో గవర్నర్ డాక్టర్తమిళసై, యూనివర్శిటీ వీసీ ఆచార్య తండెగ కిషర్రావు చేతుల మీదుగా
గోల్డ్ మెడల్ అందుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజా సంబంధ ప్రచార ప్రభావం - తెలంగాణ రాష్ట్ర అధ్యయనం’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను హరీశ్ ఈ అవార్డు అందుకున్నాడు.