
పుడుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ. 2.40కోట్లు వసూలు చేశారు నిందితులు. చివరకు ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్.. కంపెనీ తమను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పుడుచ్చేరి పోలీసులు.. సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని నిర్ణయించారు .
సినీతారలకు ఏంటి సంబంధం..?
కంపెనీ ప్రారంభోత్సవం, ప్రమోషనల్ ఈవెంట్లలో ఈ ఇద్దరు సినీతారలు తమన్నా, కాజల్ అగర్వాల్ తెగ పాల్గొన్నారు. అదే వీరి మెడకు చుట్టుకుంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ కంపెనీని 2022లో కోయంబత్తూరులో ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీనటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కంపెనీ సక్సెస్ ఈవెంట్‌కు నటి కాజల్ హాజరయ్యింది. ఆ ఈవెంట్‌లో సుమారు 100 మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఆధారంగా రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు విలువైన కార్లతో సహా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఆ ఫోటోలను ప్రకటనల్లో వేపించి కంపెనీ నిర్వాహకులు వందల కోట్లు వసూలు చేశారన్నది ఆరోపణలు. ఇప్పటికే ఈ కేసులో పుదుచ్చేరి పోలీసులు నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40) లను అరెస్టు చేశారు. కంపెనీ ప్రారంభోత్సవం, ప్రమోషనల్ ఈవెంట్లతో తమన్నా, కాజల్ అగర్వాల్‌లను ప్రశ్నిస్తే మరిన్ని ఆధారాలు దొరకచ్చనేది పోలీసుల ఆలోచన. వీరికి కేవలం ఎండార్స్‌లేనా లేదా కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో ప్రమేయం ఉందా అన్న కోసం అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్ పుడుచ్చేరిలో బయట పడ్డప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ కంపెనీ బాధితులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, ముంబై, కోయంబత్తూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, కేరళ, విల్లుపురం, తిరుప్పూర్‌లలో ఈ కంపెనీ పెట్టుబడిదారులను ప్రభావితం చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి.