అలల తాకిడికి దెబ్బతిన్న వంతెన

అలల తాకిడికి దెబ్బతిన్న వంతెన

పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి సముద్రంలో అలల అల్లకల్లోలానికి రాక్ బీచ్‌లోని ఐకానీక్ పీర్ వంతెన పాక్షికంగా కూలిపోయింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.  బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఫలితంగా రాక్ బీచ్‌లోని పుదుచ్చేరి  ఐకానిక్ పీర్ ఎత్తైన అలల కారణంగా పాక్షికంగా కూలిందని అధికారులు తెలిపారు.IMD నివేదిక ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలహీనపడింది. ఇది నైరుతి దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతుంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది.

నైరుతిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమోరిన్ ప్రాంతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి సముద్ర పరిస్థితులు చాలా ఉధృతంగా ఉంటాయని ఐఎండీ నివేదిక పేర్కొంది. మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అంతకుముందు మార్చి 5న, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి.