
వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలు పైన నెగిటివిటీ ప్రభావం పడుతుంది. .దాదాపు అందరి ఇళ్లల్లో పూజ గది ఉంటుంది. చాలా మంది డూప్లెక్స్ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్.. ఫస్ట్‌ఫ్లోర్.. సెకండ్ ఫ్లోర్ కూడా డూప్లెక్స్ పద్దతిలోనే నిర్మించుకుంటున్నారు. అయితే ఇలాంటప్పుడు పూజగది ఎక్కడ ఉండాలి అనే సంశయం చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో దీపారాధన పూజామందిరం.. కచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాం. మరి డూప్లెక్స్ ఇళ్లలో పూజగదిని ఎలా నిర్మించుకోవాలో వాస్తు పండితులు కాశీనాథుని శ్రీనివాస్ గారి సూచనలను సలహాలను చూద్దాం. . .
ప్రశ్న : జీ+2 డూప్లెక్స్ హౌస్ లో పూజగదిని .. గ్రౌండ్ ఫ్లోర్ బదులుగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో ఏ ఫ్లోర్లో పూజగది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది?
జవాబు: పూజగది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్... వీలునుబట్టి ఏ ఫ్లోర్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు.. అయితే, ఇంటి ముఖద్వారం, ఇతర నిర్మాణాల్ని బట్టి సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు తూర్పు ముఖంగా ఉండేలా చూసుకోవాలి.. అలా అవకాశం లేకపోతే పడమర ముఖంగా ఉండేలా ఏర్పాటు చేసుకున్న ఇబ్బంది లేదని వాస్తు పండితులు వాస్తు పండితులు కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.