
ఓ వైపు హీరోయిన్‌గా వరుస చిత్రాల్లో నటిస్తూనే అడపాదడపా ప్రత్యేక గీతాల్లోనూ మెరుస్తోంది పూజాహెగ్డే. ఇప్పటికే రంగస్థలం, ఎఫ్ 3 చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఆమె.. రజినీకాంత్ సినిమా కోసం మరోసారి ఈ తరహా పాటలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ సహా ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెరకెక్కుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ పాట కోసం పూజాహెగ్డేను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ సమాచారం. ‘జైలర్’లో తమన్నా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన పాట తరహాలో క్యాచీ ట్యూన్‌ని ఇందుకోసం రెడీ చేశాడట అనిరుధ్. ఇక ప్రస్తుతం సూర్యకు జంటగా ‘రెట్రో’, విజయ్ సరసన ‘జన నాయగన్’ చిత్రాల్లో పూజాహెగ్డే నటిస్తోంది.