ఆధ్యాత్మికం : పూజ గదిలో ఇనప వస్తువులు ఉండకూడదా.. అందుకేనా రాగి వస్తువులు వాడతారు..?

ఆధ్యాత్మికం : పూజ గదిలో ఇనప వస్తువులు ఉండకూడదా.. అందుకేనా రాగి వస్తువులు వాడతారు..?

హిందువులు పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ఇంటిలోకి అద్దెకు వెళుతున్నా.. సొంతిల్లు కట్టుకుంటున్నా.. అపార్ట్​ మెంట్లో ఒక పోర్షన్​ కొరుకున్నా.. కచ్చితంగా పూజ గది ఎలా ఉంది.. ఎలా ఉంది.. అది ఏ సైజులో ఉంది అనే విషయాలు కచ్చితంగా చూస్తారు.   వాస్తుప్రకారం.. పూజామందిరంలో కొన్ని వస్తువులు ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు.  పూజామందిరంలో ఏఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం. . 

పూజ చేసేటప్పుడు ఇనుప వస్తువులు వాడకూడదని పండితుల చెబుతున్నారు.  దేవుడి మందిరంలో కొన్ని వస్తువులు ఉంటే కుటుంబంలో సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు.. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని అంటున్నారు పండితులు.  ఇనుము యముడికి చెందిన లోహం.  ఇది సానుకూల శక్తులను గ్రహించదు.  పైగా నెగిటివ్​ ఎనర్జీకి సంకేతంగా ఉంటుంది.  అందుకే పూజా మందిరంలో అస్సలు ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఉంచవద్దని పండితులు అంటున్నారు. అందుకే రాగి.. వెండి,, ఇత్తడి.. మట్టితో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తారు.  

ఇక పూజ చేసేటప్పుడు తాజాగా ఉన్న పువ్వులనే ఉపయోగించాలి.  అంతకు ముందు ఉపయోగించిన పూలను అన్నింటిని తీసి .. దేవుడి మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి,  ఎండిన పువ్వులు.. రంధ్రాలున్న పువ్వులను పూజకు వాడరాదు.  అంతేకాకుండా పువ్వులను పెట్టే పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు.  అందులో కొన్ని పూలను ఉంచి వాడిపోకుండా చూసుకోవాలి.  లేదంటే ఆ పాత్రలో కొంచెం నీరు అయినా పోయాలి.  పూజా మందిరంలో ఇలాంటి పద్దతులు పాటిస్తే ఇంట్లో  సంతోషం.. ఆనందం.. పాజిటివ్​ ఎనర్జీతో పాటు ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు. 

మరోముఖ్యమైన విషయం ఏమిటంటే.. పూజ చేసేటప్పుడు ఉపయోగించే నీటి పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. పూజ పూర్తయిన తరువాత మళ్లీ దానిని నీటితో నింపి .. అందులో కొన్ని తులసి దళాలు వేయండి.  ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూజ చేసిన తరువాత ఆ నీటిని ఇంటి పైకప్పుపై పోయండి.  ఇలా చేస్తే దుష్ట శక్తులు ఇంట్లోని రావని పండితులు చెబుతున్నారు.

దేవుడి దగ్గర ఒక చిన్న గిన్నెలో గిన్నెలో బియ్యం, పప్పు వంటి వస్తువులను నింపి దేవుని  ముందు ఉంచండి.  గణేశుడి పాదాల దగ్గర బియ్యం ఉంచితే  పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  పూజకు ఉపయోగించే వస్తువులను పూజ గదిలోనే ఉంచాలి. పూజ లేని సమయాల్లో, గదిని తెరతో కప్పాలి. పూజకు అవసరం లేని వస్తువులు ఏవీ ఉండకూడదు. పూజ గది  చీకటిగా ఉండకూడదు.  పూజ గదిలో   ప్రతిరోజు దీపారాధన  దీపం వెలిగించాలి.పూజ అయిన తరువాత ధూపం.. దీపం వేయాలి.  పూజ చేసే వారి కుడి వైపున దీపం.. అగర్​బత్తీలు ఉండాలి.