సిద్దిపేట నుంచే బీఆర్ఎస్ పతనం ప్రారంభం : పూజల హరికృష్ణ

సిద్దిపేట నుంచే బీఆర్ఎస్ పతనం ప్రారంభం :  పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నుంచే బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెడతామని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 6న సిద్దిపేటలో టీపీసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షి, మైనపల్లి హనుమంతరావు పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

పర్యటనలో భాగంగా 9వ వార్డులో పట్టణ అధ్యక్షులు అత్తూ ఇమామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ తో పాటు, మెడికల్ కాలేజ్ ముందు ఉన్న కాంగ్రెస్ క్యాంపు ఆఫీస్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మార్క సతీశ్ గౌడ్, కలిముద్దీన్, తిరుపతి, రాజ నరేందర్, షాబుద్దీన్, హర్షద్, మున్నా, వహాబ్, మెరుగు రాజు పాల్గొన్నారు.