రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. రంజీ ట్రోఫీ తొలి పోరులోనే అజేయ డబుల్ సెంచరీతో విజృంభించి నేషనల్ సెలెక్టర్లను మెప్పించాడు.
పుజారా (243 నాటౌట్) మాస్టర్ క్లాస్‌తో జార్ఖండ్‌తో గ్రూప్–ఎ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 406/4తో మూడో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ను 578/4 వద్ద డిక్లేర్ చేసింది. పుజారా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 17వ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ప్రేరక్ మన్కడ్ (104 నాటౌట్) సెంచరీ చేశాడు. దాంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 432 రన్స్ భారీ ఆధిక్యం దక్కించుకుంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన జార్ఖండ్ మూడో రోజు చివరకు 140/2 స్కోరు చేసింది. కుమార్ దియోబ్రత్ (74 బ్యాటింగ్), సూరజ్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర 296 రన్స్ వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 142 రన్స్‌కే ఆలౌటైంది.