వందో టెస్టు ఆడుతున్న పూజారా..ఘనంగా సత్కరించిన బీసీసీఐ

వందో టెస్టు ఆడుతున్న పూజారా..ఘనంగా సత్కరించిన బీసీసీఐ

టీమిండియా క్రికెటర్ పూజారా అరుదైన ఘనత సాధించాడు. వంద టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. వందో టెస్టు ఆడిన 13వ బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. 

సెంచరీ చేయాలి..

వందో టెస్టు ఆడుతున్న ఛటేశ్వర పూజారాను బీసీసీఐ ఘ‌నంగా సన్మానించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ..పూజారాకు స్పెషల్ క్యాప్ను అందించాడు. టెస్టుల సెంచరీ క్లబ్కు పూజారాను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా బ్యాట్తో గ్రౌండ్లోకి దిగడం అంటే జాతీయ జెండా బాధ్యతలను మోసినట్లే అని గవాస్కర్ అన్నారు. అంతేకాకుండా వందో టెస్టులో పూజారా సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. 

సంతోషంగా ఉంది..

వందో టెస్టు ఆడుతున్న తనను సునీల్ గవాస్కర్ సన్మానించడం సంతోషంగా ఉందని పూజారా తెలిపాడు. టెస్టు మ్యాచ్ ఆడటం అంటే జీవితంలో కష్టమైన దశలను ఎదుర్కోవడమే అని పేర్కొన్నాడు. వందో టెస్టు ఆడుతున్న పూజారాకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. 

పూజారా కెరీర్..

2010లో తొలి టెస్టు ఆడిన పుజారా ఇప్పటి వరకు 100 టెస్టులు ఆడాడు. 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్థసెంచరీలున్నాయి. బెస్ట్ స్కోరు 206 పరుగులు.