రాజ్‌కోట్: టీమిండియాకు దూరమైన టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న గ్రూప్–ఎ మ్యాచ్‌లో పుజారా (157 బ్యాటింగ్) అజేయ సెంచరీతో సత్తా చాటడంతో డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర భారీ ఆధిక్యం సాధించింది.
ఓవర్‌నైట్ స్కోరు 108/1తో రెండో రోజు, శనివారం ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 406/2 స్కోరు చేసింది. హార్విక్ దేశాయ్ (85), అర్పిత్ వసవాడ (68), షెల్డన్ జాక్సన్ (54) కూడా రాణించారు. ప్రస్తుతం పుజారాకు తోడు ప్రేరక్ మన్కడ్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉండగా సౌరాష్ట్ర 264 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. జార్ఖండ్ మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌లో 142 రన్స్‌కే ఆలౌటైంది.