
ములుగు : మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయం పంచాయితీ ములుగు తహసీల్దార్ కార్యాలయానికి చేరింది. మీరెంత అంటే మీరెంత అంటూ గట్టమ్మ పూజారులు వర్సెస్ జాకారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ నాయక్ పోడ్ పూజార్ల హక్కులు కాలరాస్తున్నారని నాయక్ పోడ్ ఆందోళన చేశారు. దీనికి ప్రతిగా మేడారం సందర్భంగా నిర్వహించే టెండర్లను ఎందుకు నిలిపివేశారని జాగారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ విజయభాస్కర్ పేర్కొన్నారు. ములుగు ఎస్సై వెంకటేశ్వర్ ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపివేశారు.