కోటి తలంబ్రాలకు జంగారెడ్డి గూడెంలో పూజలు

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శ్రీరామనవమి రోజు జరిగే కల్యాణానికి కోటి గోటి తలంబ్రాల కోసం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చుట్టు పక్కల గ్రామాల భక్తులు పండించారు.

వాటికి భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి ఆదివారం జంగారెడ్డిగూడెంలోని మద్దిఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వాటిని ఆయా గ్రామాల భక్తులకు పంపిణీ చేశారు. ఆ వడ్లను నిత్య పూజ చేసి అత్యంత నిష్టతో గోటితో వలిచి శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణానికి పాదయాత్రగా తీసుకొచ్చి వారు సమర్పించనున్నారు.