చెవిరెడ్డి దేశద్రోహం కింద జైలుకెళ్ళక తప్పదు.. పులవర్తి నాని

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా కూడా ఎన్నికల వేళ చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. తిరుపతిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే పూలవర్తి నాని మధ్య నెలకొన్న రచ్చ ఇంకా సద్దుమణగలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో పూలవర్తి నానిపై చెవిరెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు పులవర్తి నాని.

చెవిరెడ్డి పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, కక్ష సాధింపు చర్యలకు నాకు సమయం లేదని అన్నారు నాని. తనపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారని, గత ఐదేళ్లలో చెవిరెడ్డి అనేక అక్రమాలు చేశారని, చెవిరెడ్డి అక్రమాలు బయటకు తీస్తే దేశద్రోహం కింద జైలుకెళ్లక తప్పదన అన్నారు పులవర్తి నాని.

ALSO READ | Chandragiri: బెంగళూరులో వైసీపీ యువ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్..