
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పులిమామిడి రాజు గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డి లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి పులిమామిడి రాజును అభినందిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. ఆయన వెంట మునిపల్లి రమేశ్, కృష్ణ, శంకర్ ఉన్నారు.