![జగన్ ను కలిసేందుకు భారీగా జనం రావడంతో తోపులాట జరిగింది: పులివెందుల డీఎస్పీ](https://static.v6velugu.com/uploads/2024/06/pulivendula-dsp-about-tension-of-ys-jagan-tour_yX9ZspVxkm.jpg)
పులివెందులలో జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయన్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. కొన్ని ఛానళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. పులివెందుల జగన్ పర్యటనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు.
"పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం జగన్ ను చూడటానికి వచ్చిన ప్రజలు ఆత్రుతతో ఒకరిపై ఒకరు పడటంతో తోపులాట జరిగింది" అని డీఎస్పీ తెలిపారు.