స్కేటింగ్ లో పుల్లూరు స్టూడెంట్ కు మూడు మెడల్స్

స్కేటింగ్ లో పుల్లూరు స్టూడెంట్ కు మూడు మెడల్స్

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దీపక్  జాతీయస్థాయిలో సత్తా చాటాడు. మధురైలో జరిగిన 24వ జాతీయ స్కేటింగ్  చాంపియన్ షిప్ పోటీల్లో కరణం దివితేశ్​ దీపక్  2 కాంస్య పతకాలు, ఒక రజత పతకం సాధించాడు. 

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గ్రామ పెద్దలు దీపక్ ను అభినందించారు. దీపక్ తిరుపతిలోని శ్రీ పద్మావతి హైస్కూల్​లో ఏడవ తరగతి చదువుతున్నాడు.