బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళటం చాలామందికి ఇష్టం ఉంటుంది.. పనికట్టుకొని మరీ బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లేవారు చాలామంది ఉంటారు. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళటం వల్ల యాక్సిడెంట్లు ఐయ్యే ప్రమాదంతో పాటు బైక్ లో మంటలు వచ్చి కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. మేడ్చల్ జిల్లా నాగారంలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే.. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లాలంటే మీరు కూడా ఆలోచిస్తారు.. పల్సర్ బైక్ లో మంటలు రావడంతో పూర్తిగా కాలిపోయిన ఘటన నాగారంలో చోటు చేసుకుంది. శుక్రవారం ( జనవరి 3, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
సిద్ధిపేట నుండి బోడుప్పల్ కి పల్సర్ 220 బైక్ పై బయలుదేరాడు ఓ యువకుడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం దగ్గరకు రాగానే బైక్ లో ఉన్నట్లుండి మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన యువకుడు బైక్ ఆపేశాడు. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది మంటల్లో కాలిపోతున్న బైక్ ను గమనించి ఫైర్ సేఫ్టీ పరికరాలు తెచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేశారు.
ALSO READ | శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
పెట్రోల్ బంక్ సిబ్బంది ప్రయత్నం ఫలించలేదు.. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఘటనను గమనించి ఒక్కసారిగా వాహనాలు ఆపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి అలర్ట్: పల్సర్ బైక్ లో మంటలు.. పూర్తిగా కాలిపోయింది.. pic.twitter.com/daCekjIuWh
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) January 3, 2025