Good News : మార్చి 3 (ఆదివారం) పల్స్ పోలియో.. పేరంట్స్ గుర్తుపెట్టుకోండి

 దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3న జరగనుంది.  5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి  పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని  రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.  అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను (మొబైల్ , నాన్-మొబైల్) ఏర్పాటు చేశారు  పిల్లలకు. ఓరల్ పోలియో వ్యాక్సిన్‌ని అందించడానికి వాలంటీర్లకు శిక్షణనిస్తున్నారు.

తల్లిదండ్రులు తప్పకుండా ఆదివారం(మార్చి 3న)  చిన్నపిల్లలకు పోలియో చుక్కులు వేయించండి. ఎన్ని పనులున్నాబాధ్యాతయుతంగా పిల్లలను దగ్గర్లోని కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించాలి. జిల్లాల్లో తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఒక వేళ మార్చి 3 న మర్చిపోతే నాలుగు,ఐదు తేదీల్లో ఆయా గ్రామాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. 

పోలియో వ్యాధి చిన్న పిల్లలకు రావడం, తరచూ జ్వరాలు రావడం అది మెదడుకు పాకి ఇబ్బందికరంగా మారడం జరుగుతుంటాయి.నరాల బలహీనత ఏర్పడుతుంది.  ఈ పోలియో వ్యాది నివారణకు టీకా తప్పా మరొకటి లేకపోవడంతో పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని  డాక్టరల్లు సూచిస్తున్నారు.