న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఈరోజు ఓ బ్లాక్ డే. ఫిబ్రవరి 14, 2019.. భారత్ కు మరువలేని రోజు. 40 మంది భారత జవాన్లు.. టెర్రరిస్టుల ఘాతుకానికి బలైన రోజు. జమ్మూ శ్రీనగర్ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపురా దగ్గర సీఆర్పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ గా టెర్రరిస్టులు ఎటాక్ చేసింది ఈరోజే. ఈ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. పాకిస్తానీ టెర్రరిస్టు గ్రూప్ జైషే మహమూద్ కు చెందిన సూసైడ్ బాంబర్ కారులో ఐఈడీతో దూసుకొచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సును ఢీకొట్టాడు. అవంతిపుర దగ్గర జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై జరిగిన ఘటనలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సును.. 300 కేజీల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారుతో ఓ సూసైడ్ బాంబర్ ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ దురాగతానికి తామే బాధ్యులమని జైషే మహమూద్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. సూసైడ్ బాంబర్ కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదిల్ అహ్మద్ దార్ గా గుర్తించారు. అదిల్ స్వస్థలం పుల్వామా జిల్లా గుండీబాగ్. ఎటాక్ కు ఏడాది క్రితమే అతను జైషేలో చేరాడు. ఎటాక్ జరిగిన స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మారుతీ ఎకో వ్యాన్ ను రెంట్ కు తీసుకుని అదిల్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రతీకారం తీర్చుకున్న భారత్
పుల్వామా దాడి ఫాలౌట్ కూడా చాలా పెద్దది. ఈ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు 15 రోజుల తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. 2019 ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ బాలాకోట్ లోని జైషే ట్రైనింగ్ క్యాంప్ పై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా ఎటాక్ సూత్రధారి, జైషే మహమూద్ కశ్మీ ర్ చీఫ్ మహమూద్ ఖరి యాసిర్ ను అవంతిపురాలోని పరిట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు హతమార్చాయి.
మరిన్ని వార్తల కోసం: